Connect with us

World

అదుపులో ద్రవ్యోల్బణం…

janamvelugunews

Published

on

విశ్లేషణ)
జనంవెలుగు:- దేశవ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పండుగల్లో ఒకటైన దసరా మరికొన్ని రోజుల్లోనే ఉంది. ఆ తర్వాత దీపావళి వస్తుంది. ఈ పండుగల సమయంలో ఇంటింటా పిండివంటల ఘుమఘుమలు ఉంటాయి. పండుగ ప్రత్యేక వంటల వల్ల వంట సరుకులకు డిమాండ్‌ పెరిగి, కొరత ఏర్పడే అవకాశం లేకపోలేదు. దీనివల్ల రేట్లు పెరుగుతాయి. ప్రస్తుత ఫెస్టివ్‌ సీజన్‌లో డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై జరిగేలా, తద్వారా రేట్లకు కళ్లెం వేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి, పండుగల సీజన్‌లో ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.  ప్రపంచ మార్కెట్‌లోకి బియ్యాన్ని ఎక్కువగా ఎగుమతి చేసేది మన దేశమే. మన మార్కెట్‌లో పెరుగుతున్న రైస్‌ రేట్లను కిందకు దించడానికి, బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం గతంలోనే ఆంక్షలు విధించింది. ముఖ్యంగా, ఉడకబెట్టిన బియ్యంపై ఎగుమతి సుంకాన్ని 20%కు పెంచింది. ఇండియా డెసిషన్‌తో, రైస్‌ ఎక్కువగా తినే ఆసియాతో సహా మొత్తం ప్రపంచ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగాయి. ప్రస్తుత పండుగల సీజన్, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మరికొంత కాలం వరకు కంటిన్యూ చేయవచ్చు.దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి, ఈ ఏడాది జులై నెలాఖరులో, భారత ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ నిర్ణయం ఈ నెల 15వ తేదీ (అక్టోబర్ 15, 2023‌) వరకు వర్తిస్తుంది. గడువు దగ్గర పడింది కాబట్టి, ఎగుమతి సుంకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచొచ్చని గతంలో వార్తలు వచ్చాయి. కొందరు ప్రభుత్వ అధికారులు ఆ వార్తల్లో నిజం లేదన్నారు. బాయిల్డ్ రైస్ ఎగుమతిపై సుంకాన్ని 40 శాతం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అయితే, 20 శాతం నుంచి తగ్గించకుండా, గడువును ఇంకా పెంచే ఛాన్స్‌ ఉందని క్లూ ఇచ్చారు.మన దేశంలో ఈ ఏడాది చివరి నాటికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల వేళ ప్రజాగ్రహానికి గురి కాకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో, దేశీయ మార్కెట్‌లో రైస్‌ రేట్లను తగ్గించేందుకు ఎగుమతి సుంకాన్ని ఇంకా పెంచాలని నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం ప్రపంచంపై పడుతుంది. జులైలో 20% ఎగుమతి సుంకం విధిస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం తర్వాత ఆసియా మార్కెట్లలో బియ్యం ధరలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించిన ప్రతికూల వాతావరణం కూడా ఈ సంవత్సరం బియ్యం ఉత్పత్తిని ప్రభావితం చేసింది.ముఖ్యంగా వంట నూనెలు, గోధుమ పిండి, శనగ పిండి, బియ్యం, పంచదార రేట్లు పెరగకపోవచ్చు. కూరగాయల ధరలు కూడా అదుపులోనే ఉండే ఛాన్స్‌ ఉంది.వంట సరుకులను అక్రమంగా నిల్వ చేసి, కృత్రిమంగా రేట్లు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, సరఫరాలు పెంచేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. ఎగుమతుల నిషేధం, స్టాక్ హోల్డింగ్‌పై పరిమితిని విధించడం దీనిలో భాగం. అంతేకాదు… ఫెస్టివ్‌ సీజన్‌ కోసం గోధుమలు, బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలను ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI) గోడౌన్ల నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ చర్యల ఫలితంగా సప్లైస్‌, రేట్లు కంట్రోల్‌లోకి వచ్చాయి.సాధారణంగా, పండుగ సీజన్ వచ్చేసరికి చక్కెర సహా కొన్ని ఆహార పదార్థాల ధరలు సామాన్యుడికి అందకుండా పరుగులు పెడుతుంటాయి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, ఈసారి పరిస్థితి అలా ఉండకపోవచ్చు. ఈ పండుగ సీజన్‌లో  గోధుమ పిండి, శనగపిండి, పాల ఉత్పత్తులు, వంట నూనెలు, పంచదార ధరలు స్థిరంగా ఉంటాయని అంచనా.దేశంలో చక్కెర సరఫరా తగ్గింది. కాబట్టి, దసరా నవరాత్రుల సమయంలో షుగర్‌ రేటు పెరగకపోయినా, తగ్గదని మాత్రం మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ప్రభుత్వం కొత్త చక్కెర నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. దీపావళి వచ్చే నాటికి పంచదార ధర పెరిగే అవకాశం లేకపోలేదు. దీనిని కూడా అడ్డుకోవడానికి, పంచదార ఎగుమతులపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై అతి త్వరలోనే ఆదేశాలు వస్తాయని గవర్నమెంట్‌ అఫీషియల్స్‌ చెప్పారు. మన దేశంలో, అక్టోబర్‌ 1 నుంచి షుగర్‌ సీజన్‌ ప్రారంభమైంది. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి రుతుపవనాలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. సగటు వర్షపాతం కూడా నమోదవ్వలేదు. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవలేదు. ఫలితంగా చెరకు ఉత్పత్తి, షుగర్‌ ప్రొడక్షన్‌ తగ్గే ప్రమాదం ఉంది. ఈ రిస్క్‌ నుంచి దేశ ప్రజలను తప్పించడానికి, విదేశాలకు చక్కెర ఎగుమతి కాకుండా నిషేధం విధించబోతోంది. ఫలితంగా, ఆ చక్కెర మొత్తం దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది. మిల్క్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అక్షలీ షా చెబుతున్న ప్రకారం, గత సంవత్సరం బాగా పెరిగిన పాల ఉత్పత్తుల రేట్లు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. పండుగల వల్ల నెయ్యి, పాలు, ఇతర పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

World

వరద బాధితులకు మేము సైతం

janamvelugunews

Published

on

వరద బాధితులకు మేము సైతం

తెలుగు జర్నలిస్టుల సంక్షేమసంగం

జనం వెలుగు, వెబ్ డెస్క్:- గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్నిఅతలా కుతలం చేసిన అతి పెద్ద వరదల్లో విజయవాడ వరద కూడా వచ్చి చేరింది.లక్షల మంది ప్రజలను ప్రభావితం చేశాయి.మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వాయనాడ్ బీభాత్సవం తెలియజేస్తే లేటెస్ట్ గా బెజవాడ వరదలు మరోసారి కన్నెర్రాశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిస్సహాయులకు మరిన్ని సేవలు అందించే లక్ష్యంతో, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ముడు రోజులుగా,వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ బాధితులు సహాయం కోసం ఎదిరి చూస్తున్నారు. అటు జర్నలిస్ట్ ల కైనా ఇటు సామాన్య ప్రజలకైనా ఆపద వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుండే యూనియన్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంగం.. వరదల్లో చిక్కుకున్న బాధితులకు 5000వేల పులిహార ప్యాకెట్లు, మంచి నీళ్ళ బాటిల్స్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా వరద నీటితో అంటురోగాలు, వ్యాధులు ప్రబలకుండా బాధితులకు హోమియోపతి రోగనిరోధక శక్తి బిళ్ళలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు జర్నలిస్టులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

World

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా

janamvelugunews

Published

on

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా

జనంవెలుగు, హైదరాబాద్:- దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు ఎస్సీ వర్గాల డిమాండ్ ఆచరణ రూపంలోకి వచ్చేందుకు ఇక అడుగులు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో ఉప వర్గీకరణ సాధ్యమేనా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం. కీలక తీర్పు వెలువ రించింది. వర్గీకరణ సమర్థ నీయం అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోంది.2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల్లో ఉప వర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టారు ఆనాటి సీఎం చంద్రబాబు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో 2004లో వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం లేదంటూ అప్పటి జస్టిస్ చిన్నయ్య తీర్పు వెలువరించారు. ఆ తర్వాత 2010లో పంజాబ్ ప్రభుత్వం వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్ కల్పిం చింది. అయితే దీనిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. పంజాబ్ వేసిన పిటిషన్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం జస్టిస్ చిన్నయ్య ధర్మాసనం తీర్పును తప్పుబట్టింది. ఆ తీర్పును పున‌:సమీక్షిం చాలని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో పాటు దాఖలైన 23 పిటిషన్లను విచారించిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం. గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఏడుగురు సభ్యులు ఉన్న ధర్మాసనంలో ఆరుగురు వర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు.

Continue Reading

World

ఆ పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలిజ్వరం

janamvelugunews

Published

on

ఆ పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలిజ్వరం

సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన మొదటి సిపాయి మన మంగళ్ పాండే

-నేడు ఆయన జయంతి

జనంవెలుగు, విశ్లేషణ:- భారతదేశనికి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని కలలుకన్న మహనీయుడు అతడు. అతడి పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలిజ్వరం పుట్టించిన భారతదేశ సింహస్వప్నం. బహుశా ఈ తరం యువకులకు మంగల్‌ పాండే గురించి అంతగా తెలువకపోవచ్చు కానీ దేశ మొదటి స్వతంత్య్ర సంగ్రామంలో బొబ్బిలి పులిల పోరాడిన ధీరుడు. మంగల్‌ పాండే 19 జులై 1827న ఉత్తరప్ర దేశ్‌లోని నగ్వ గ్రామంలో దివాకర్‌, అభైరని పాండే లకు జన్మించాడు. 1857- 58 మధ్య కాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాటును ప్రథమ స్వతంత్య్ర సంగ్రా మంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకి బ్రిటిష్‌ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి. బ్రిటిష్‌ వారికి భారత పాలకులైన మొగలులు, పీష్వాల పట్ల నిర్లక్ష్య వైఖరి లాంటి రాజకీయ కారణాల వల్ల భారతీయులు బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించారు. డౌహల్సి ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం లాంటివి ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఈనేపథ్యంలో బ్రిటిష్‌ వారు సిపాయిలను ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా 1857 మార్చ్‌ నెలలో 34వ దేశీయ పదాతి దళానికి చెందిన సైనికుడు మంగల్‌ పాండే బ్రిటిష్‌ సార్జెంట్‌ మీద దాడిచేసి, అతని సహాయకుడిని గాయపరచాడు. దానికి సార్జెంట్‌.. మంగల్‌ పాండేను మతపిచ్చి పట్టినవాడిగా భావించి పాండేను బంధించాలని జమిందార్‌ను ఆజ్ఞాపించాడు. అతను కూడా జమిం దార్‌ ఆజ్ఞను తిరస్కరించాడం ద్వారా సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్‌ వారిని భారత సిపాయిలు ఊచకోత కోశారు. దీంతో మంగల్‌ పాండేను, జమిందార్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం పట్టుకొని ఏప్రిల్‌ 7న ఉరితీసింది. పాండే స్ఫూర్తితో మధ్య భారతదేశంలో ఝాన్సీరాణి, నానాసాహెబ్‌ లాంటి ధీరులు కూడా స్వతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. పాండేకు గౌరవార్ధం అప్పటి ప్రభుత్వం 1984లో పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది.

Continue Reading