World
ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న తొలి చార్టర్డ్ ఫ్లైట్


ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న తొలి చార్టర్డ్ ఫ్లైట్
జనంవెలుగు, న్యూఢిల్లీ:- హమాస్ హింసతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్ దేశం నుంచి భారతీలయను తీసుకువస్తున్న తొలి ఫ్లైట్ శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో AI 1140 విమానం ల్యాండయింది. ఫస్ట్ బ్యాచ్‌లో 212 మంది భారతీయులు వచ్చారు. పలువురు తెలుగు విద్యార్థులు కుడా ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో భారతీయులను కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రిసీవ్ చేసుకున్నారు. అయనకు విద్యార్దులు ఇజ్రాయెల్‌లో పరిస్థితులను వివరించారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ గురువారం రాత్రి బయలుదేరింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండయింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం ఆపరేషన్ అజయ్ చేపట్టిన విషయం తెలిసిందే.
World
వరద బాధితులకు మేము సైతం


వరద బాధితులకు మేము సైతం
తెలుగు జర్నలిస్టుల సంక్షేమసంగం
జనం వెలుగు, వెబ్ డెస్క్:- గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్నిఅతలా కుతలం చేసిన అతి పెద్ద వరదల్లో విజయవాడ వరద కూడా వచ్చి చేరింది.లక్షల మంది ప్రజలను ప్రభావితం చేశాయి.మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వాయనాడ్ బీభాత్సవం తెలియజేస్తే లేటెస్ట్ గా బెజవాడ వరదలు మరోసారి కన్నెర్రాశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిస్సహాయులకు మరిన్ని సేవలు అందించే లక్ష్యంతో, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ముడు రోజులుగా,వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ బాధితులు సహాయం కోసం ఎదిరి చూస్తున్నారు. అటు జర్నలిస్ట్ ల కైనా ఇటు సామాన్య ప్రజలకైనా ఆపద వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుండే యూనియన్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంగం.. వరదల్లో చిక్కుకున్న బాధితులకు 5000వేల పులిహార ప్యాకెట్లు, మంచి నీళ్ళ బాటిల్స్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా వరద నీటితో అంటురోగాలు, వ్యాధులు ప్రబలకుండా బాధితులకు హోమియోపతి రోగనిరోధక శక్తి బిళ్ళలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు జర్నలిస్టులందరికి కృతజ్ఞతలు తెలిపారు.
World
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా


ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా
జనంవెలుగు, హైదరాబాద్:- దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు ఎస్సీ వర్గాల డిమాండ్ ఆచరణ రూపంలోకి వచ్చేందుకు ఇక అడుగులు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో ఉప వర్గీకరణ సాధ్యమేనా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం. కీలక తీర్పు వెలువ రించింది. వర్గీకరణ సమర్థ నీయం అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోంది.2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల్లో ఉప వర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టారు ఆనాటి సీఎం చంద్రబాబు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో 2004లో వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం లేదంటూ అప్పటి జస్టిస్ చిన్నయ్య తీర్పు వెలువరించారు. ఆ తర్వాత 2010లో పంజాబ్ ప్రభుత్వం వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్ కల్పిం చింది. అయితే దీనిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. పంజాబ్ వేసిన పిటిషన్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం జస్టిస్ చిన్నయ్య ధర్మాసనం తీర్పును తప్పుబట్టింది. ఆ తీర్పును పున:సమీక్షిం చాలని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో పాటు దాఖలైన 23 పిటిషన్లను విచారించిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం. గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఏడుగురు సభ్యులు ఉన్న ధర్మాసనంలో ఆరుగురు వర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు.
World
ఆ పేరు వింటేనే బ్రిటిష్ వారి గుండెలో చలిజ్వరం


ఆ పేరు వింటేనే బ్రిటిష్ వారి గుండెలో చలిజ్వరం
సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన మొదటి సిపాయి మన మంగళ్ పాండే
-నేడు ఆయన జయంతి
జనంవెలుగు, విశ్లేషణ:- భారతదేశనికి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని కలలుకన్న మహనీయుడు అతడు. అతడి పేరు వింటేనే బ్రిటిష్ వారి గుండెలో చలిజ్వరం పుట్టించిన భారతదేశ సింహస్వప్నం. బహుశా ఈ తరం యువకులకు మంగల్ పాండే గురించి అంతగా తెలువకపోవచ్చు కానీ దేశ మొదటి స్వతంత్య్ర సంగ్రామంలో బొబ్బిలి పులిల పోరాడిన ధీరుడు. మంగల్ పాండే 19 జులై 1827న ఉత్తరప్ర దేశ్‌లోని నగ్వ గ్రామంలో దివాకర్, అభైరని పాండే లకు జన్మించాడు. 1857- 58 మధ్య కాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాటును ప్రథమ స్వతంత్య్ర సంగ్రా మంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకి బ్రిటిష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొగలులు, పీష్వాల పట్ల నిర్లక్ష్య వైఖరి లాంటి రాజకీయ కారణాల వల్ల భారతీయులు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు. డౌహల్సి ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం లాంటివి ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఈనేపథ్యంలో బ్రిటిష్ వారు సిపాయిలను ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా 1857 మార్చ్ నెలలో 34వ దేశీయ పదాతి దళానికి చెందిన సైనికుడు మంగల్ పాండే బ్రిటిష్ సార్జెంట్ మీద దాడిచేసి, అతని సహాయకుడిని గాయపరచాడు. దానికి సార్జెంట్.. మంగల్ పాండేను మతపిచ్చి పట్టినవాడిగా భావించి పాండేను బంధించాలని జమిందార్‌ను ఆజ్ఞాపించాడు. అతను కూడా జమిం దార్ ఆజ్ఞను తిరస్కరించాడం ద్వారా సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ వారిని భారత సిపాయిలు ఊచకోత కోశారు. దీంతో మంగల్ పాండేను, జమిందార్‌ను బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకొని ఏప్రిల్ 7న ఉరితీసింది. పాండే స్ఫూర్తితో మధ్య భారతదేశంలో ఝాన్సీరాణి, నానాసాహెబ్ లాంటి ధీరులు కూడా స్వతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. పాండేకు గౌరవార్ధం అప్పటి ప్రభుత్వం 1984లో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.








