Education
ప్రధానోపాధ్యాయులకు పదవీ విరమణ వీడ్కోలు


బోరిగామ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పదవీ విరమణ వీడ్కోలు
జనం వెలుగు, అదిలాబాద్ బ్యూరో అనిల్ గంటాడి:- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బోరిగామా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న లాడే వార్ గంగాధర్ ఆదివారం ఉద్యోగ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థినులు గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరు కలిసి పదవి విరమణ పొందిన ప్రధాన ఉపాధ్యాయుడు లాడే వార్ గంగాధర్ ను పాఠశాలలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ లాడేవారు గంగాధర్ 1963 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని మరల పల్లి గ్రామంలో లాడేవారు రాములు గంగుబాయికి మొదటి సంతానంగా జన్మించి మర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక విద్యను అభ్యసించారని ఒక క్రమశిక్షణతో విద్యను అభ్యసించి 1987 సంవత్సరంలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఉద్యోగంలో చేరి అంచలంచెలుగా ప్రధాన ఉపాధ్యాయ స్థాయికి ఎదిగి ఈరోజు అయనా పదవీ విరమణ పొందుతున్నారని అన్నారు. అయినా సుమారు 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరో మంది విద్యార్థులు విద్యార్థులను విద్యాబుధుల నేర్పి ఉన్నత స్థాయిలో విద్యను అందించి ఎందరో మంది జీవితాలను వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి లాడే వారు గంగాధర్ అని అన్నారు. జిల్లాలలో పలు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తూ ఎందరో మంది విద్యార్థులు విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ విద్యా చదువు యొక్క విలువను తెలియజేసిన మహానుభావుడు లాడే వార్ గంగాధర్ అని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమని ఉపాధ్యాయ వృత్తిలో నేటి విద్యార్థిని విద్యార్థులను రేపటి మంచి పౌరులుగా తీర్చించడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని పలువురు గ్రామ పెద్దలు అన్నారు. గంగాధర్ ఏడు నెలల క్రితమే పీజీ హెచ్ఎంగా పదోన్నతి పొంది బోరిగం పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా రావడం జరిగిందని. ఈ ఏడు నెలలు అయినా అందరితో కలుపు మెలుపుగా ఉండి మంచి ఉపాధ్యాయుడుగా మీరు ప్రఖ్యాతులు సంపాదించారని ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అష్టైశ్వర్యాలతో శేష జీవితాన్ని సుఖశాంతులతో గడపాలని భగవంతుని యొక్క సర్వ ఆశీస్సులు ఆయన పైన ఆయన కుటుంబం పైన ఉండాలని వేడుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నార
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శాంతినగర్ లో పదవీ విరమణ వేడుకలు పలికిన పలువురు శాంతినగర్ కాలనీవాసులు తోటి ఉపాధ్యాయులు
ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో పలువురు ఉపాధ్యాయులు కాలనీవాసులు తోటి మిత్రులు బంధువులు తోటి ఉపాధ్యాయులు ఆయన శిష్యులైనటువంటి నాటి విద్యార్థి విద్యార్థులు నేటి ఉద్యోగులుగా పలువురు అయిన ఇంటి వద్ద ఏర్పాటుచేసిన సన్మాన సభ కార్యక్రమంలో పలువురు హాజరై పదవీ విరమణ పొందిన లాడేవారు గంగాధరకు శాలువరతో సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ కాలనీవాసులు తోటి ఉపాధ్యాయులు బంధువులు కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు ఒకనాటి ఆయన శిష్యులైనటువంటి విద్యార్థులు పలువురు. అయినా గత 30 సంవత్సరాలు క్రితం అందించినట్టు విద్యను గుర్తుచేస్తూ నెమరేసుకున్నారు. ఈరోజు ఆయన పదవీ విరవైనా చేయడం బాధాకరమని. అయినా శిష్యులుగా మేము గంగాధర్ సార్ నైతిక విలువలతో కూడినటువంటి విద్యను చదువుతో నా విద్యను అందించారని అయినా నేర్పిన విద్యతోనే మేము ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు పొందు ఒక మంచి స్థాయిలో ఉన్నామంటే ఆనాడు అయినా చెప్పినటువంటి విద్యా బోధనలే అని గుర్తు చేశారు. పలువురు ఉపాధ్యాయులు కాలనీవాసులు, విద్యార్థిని విద్యార్థులు బంధువులు. వారు వారి కుటుంబం ఆరోగ్యం అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో కలకాలం ఆడుతూ పాడుతూ శేష జీవితాన్ని గడపాలని భగవంతుని యొక్క ఆశలు వారిపై ఉండాలని పలువురు కోరారు.
Education
|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి


భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Education
| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు


పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు
జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.
Crime
రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి


రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలిగిచూసింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటుచేసుకున్నా ఇప్పటివరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద, మండల వైద్యాధికారి, ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంఇఓను చారవాణిలో సంప్రదించగా ఘటన వాస్తవమేనని తెలిసిందని ఈ రోజు వెళ్లి విచారించి నివేదిక పంపిస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందని, అందుకే అతడిని పాఠశాల నుండి వెళ్లిపోమని చెప్పినట్లు వివరించారు.








