Connect with us

Birthday

లెనిన్ 154 జయంతి సందర్భంగా జోహార్లు

janamvelugunews

Published

on

లెనిన్ 154 జయంతి సందర్భంగా జోహార్లు…ఎస్ ఎఫ్ ఐ నిర్మల్ జిల్లా కమిటీ

జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:- ఎస్ ఎఫ్ ఐ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ జయంతి ని జరిపారు..ఈ సందర్బంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు నామత్కర్ నవీన్ మాట్లాడ్తు భారత యువ కిషోరం. షాహిద్ భగత్ సింగ్ గురువుగా భావించింది. లెనిన్ ను, భగత్ ఉరి కంభం ఎక్కేకొన్ని గంటల ముందు నుంచి ఉరి కంభం ఎక్కే వరకు చదివిన పుస్తకం లెనిన్ దే..ఐక్య సంఘటన నిర్మాణంలో ఎత్తుగడలే కీలకం అని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం మధ్య ఐక్య సంఘటన ను ప్రతిపాదించిన లెనిన్. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడి తీవ్రతరం అయ్యేకొద్దీ నష్టపోతున్న ఫీడిత తరగతులే కార్మిక వర్గ స్వభావ0ను సంతరించుకుంటారు. వారే ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేఖంగా ప్రజాతంత్ర హక్కుల కోసం పోరాడతారన్న 154 జయంతి సందర్భంగా జోహార్లు. ఐక్య సంఘటన నిర్మాణంలో ఎత్తుగడలే కీలకం అని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం మధ్య ఐక్య సంఘటనను ప్రతిపాదించిన లెనిన్. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడి తీవ్రతరం అయ్యేకొద్దీ నష్టపోతున్న ఫీడిత తరగతులే కార్మిక వర్గ స్వభావ0ను సంతరించుకుంటారు. వారే ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేఖంగా ప్రజాతంత్ర హక్కుల కోసం పోరాడతారన్న లెనిన్ కార్మిక కర్షిక ఐక్యత గురుంచి, విప్లవ కార్యాచరణలో కార్మిక వర్గ అగ్రగామిగా పార్టీ నిర్మాణ ఆవశ్యకత గురుంచి నొక్కి చెప్పిన లెనిన్ ప్రపంచ వ్యాపిత పెట్టుబడి దారి వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న తీరును కార్ల మార్క్స్ వివరిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ గుత్తపెట్టుబడి దారి వ్యవస్థగా, గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్య వాద వ్యవస్థగా అభివృద్ధి చెంది ఫైనాన్స్ పెట్టుబడిగా దాని రూపాంతరం ఎలా మార్పు చెందుతుందనే క్రమంను వివరించిన లెనిన్. అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులను, సంపదను దోచుకోవడమే సామ్రాజ్య వాద దేశాల స్వభావం అని నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలలోనే సోషలిజం సాధ్యం అన్న సాంప్రదాయ అభిప్రాయం తప్పు అని సామ్రాజ్య వాద వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉన్నదశలో పెట్టుబడి దారీ వ్యవస్థ అనుసరించే విధాన0 వలన పెరిగే అసమాన అభివృద్ధి వల్ల వెనుకబడిన దేశాలలో కూడా సోషలిజం సాధించడం సాధ్యమే అని నిరూపించిన లెనిన్ భారత దేశ విముక్తి కై పోరాడాలి అని చేయూత ఇచ్చిన లెనిన్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఉప్పరి సత్యం, సతీష్, రజిత తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Birthday

|Nandipet నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….

janamvelugunews

Published

on

నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….

పల్లె పల్లె నా పండగలా 135 వ అంబేద్కర్ జయంతి…

నందిపేట్ ఏప్రిల్ 14 (జనం, వెలుగు): నందిపేట డొంకేశ్వర్ మండలాలలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఆయన ప్రతిమల వద్ద పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

ముందుగా మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో మండల కేంద్రం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చౌరస్తా మొత్తం నీలిరంగుల జెండాలతో నింపేసి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.

అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా మహన్నదనా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వివిధ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, బహుజన పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు జోహార్లు అర్పించారు. మండల ట్రస్మా, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న మాట్లాడుతూ….. భీమ్రావు రాంజీ అంబేద్కర్ అనే పేరు, ఆయన ప్రతిమ లేని ప్రదేశం ఈ భారత దేశంలో ఎక్కడ లేదని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన యుగ పురుషుడని కొనియాడారు.

సమానత్వం కొరకు అంటరాని తనం అనే విష సంస్కృతిని రూపుమాపేందుకు ఎంతో దూరదృష్టిగా రాజ్యాంగ చట్టం కల్పించి అట్టడుగు వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడు అన్నారు. మండల కేంద్రం అంబేద్కర్ సంఘం సభ్యులు మాట్లాడుతూ…. అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో బహుజనులకు రక్షణ కరువయ్యేదని ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా సమాన హక్కులు ఉండేవి కావని, ఉక్కుపాదంతో అణిచివేసేవారని, ఈరోజు అనగారిన వర్గాల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే ఆ బిక్ష అంబేద్కర్ పెట్టిన భిక్షేనని అన్నారు.

Continue Reading

Birthday

బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక

జనం వెలుగు – చౌటకూర్:- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరఫ్‌పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో మోహన్, విలేజ్ ప్రెసిడెంట్ గోవర్ధన్, మాజీ సర్పంచ్ హనుమంతరావు, పర్మేశ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, వార్డ్ మెంబర్ వెంకటేశం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న నాయకులు సురేష్ సేవలను ప్రశంసించారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఉత్సాహంగా జరుపుకున్నారు.

Continue Reading

Birthday

PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి

janamvelugunews

Published

on

PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి

జనంవెలుగు, నిజామాబాద్:- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని PRTU తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక పులాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్ మాట్లాడుతూ, అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి సమానత్వాన్ని, స్వేచ్ఛను ప్రసాదించారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగేశ్వరరావు, గంగాధర్, బుచ్చన్న, జావీద్, శ్రీకాంత్, వినోద్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతిజ్ఞ చేశారు.

Continue Reading