మెదక్
జర్నలిజం పితామహుడి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించాలి


జర్నలిజం పితామహుడి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించాలి
భారతదేశంలోనే మొట్టమొదటి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి
కౌడిపల్లి మండల రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు
జనం వెలుగు, కౌడిపల్లి :- మెదక్ జిల్లా కౌడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామానంద చటర్జీ గురించి చెప్పుకొచ్చారు, పశ్చిమ బెంగాల్ వాసి రామానంద చటర్జీ, భారతదేశంలోనే తొలి జర్నలిస్ట్, పుట్టిన తేదీ: 29 మే 1865, పుట్టిన స్థలం బంకురా పశ్చిమ బెంగాల్ భారతదేశం, తల్లి హర సుందరి దేవి, తండ్రి శ్రీనాథ్ చటోపాధ్యాయ, పిల్లలు కేదార్ నాథ్ చటోపాధ్యాయ, చటర్జీ వృత్తి జర్నలిస్ట్ ఎడిటర్ ఆయన చదువుకున్న కళాశాల సెయింట్ జేవియర్స్ కళాశాల భారతదేశంలోని కోల్ కత్తాలో చదువు పూర్తి చేసుకొని కలకత్తాలో మొట్టమొదటిసారిగా (1907లో సం” ది మోడరన్ రివ్యూ,) అనే ఆంగ్ల పత్రికను తొలిసారిగా రచించి మీడియా రంగానికి వ్యవస్థాపకుడు, సంపాదకుడు, యజమాని అయ్యాడు ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం, భారతీయ జర్నలిజం పితామహుడని అభివర్ణించారు. ఆ తర్వాత ఎన్నో పత్రికలను రచించి, భారత దేశ స్వాతంత్ర పోరాటంలోతన వంతు కృషి చేస్తూ ఎందరో మహానుభావులు భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం ప్రాణాలర్పించిన, స్వాతంత్ర సమరయోధుల గురించి ఎప్పటికప్పుడు వార్తలు రాస్తూ వెలుగులోకి తీసుకువచ్చిన వ్యక్తి రామానంద చటర్జీ, ఆయన మరణించిన (తేదీ:30 సెప్టెంబర్ 1943,) ఆయన మరణించే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరాలు, ఆయన చనిపోయే చివరి వరకు జర్నలిజంలోనే పోరాడాడు, మనం కూడా జర్నలిజంలో ఉన్నాం అలాంటి గొప్ప వ్యక్తిని మనం తలుచుకుంటున్నాం, అతని జయంతి వర్ధంతి కార్యక్రమాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు ఏర్పాటుచేసిన సమావేశంలో ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు అలాగే అతని విగ్రహాన్ని కూడా హైదరాబాద్ నడిబొడ్డున స్వాతంత్ర సమరయోధులతో పాటు అతని విగ్రహాన్ని నిర్మిస్తే భారతదేశానికే అరుదైన గౌరవం దక్కుతుందని తెలియజేశారు.
మెదక్
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ


ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ
జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.
రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక


ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక
జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.
మెదక్
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్


అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్
జనంవెలుగు, చిలప్ చెడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.
రక్తదాత సుఖీభవ








