Connect with us

భక్తి

బాల్కొండలో ఘనంగా “గురు”పౌర్ణమి

janamvelugunews

Published

on

బాల్కొండలో ఘనంగా “గురు”పౌర్ణమి

జనం వెలుగు బాల్కొండ:- అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన బాల్కొండ పట్టణంలోని అమృత ధార ఆశ్రమంలోను, మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలోని భగవాన్ శ్రీ సత్యా నంద గీతాశ్రమంలోను, వన్నెల్ బి గ్రామంలోని శ్రీ శివరామ కృష్ణ తపోవన తథతర ఆశ్రమాలలో ఆదివారం నాడు ఆ యా ఆశ్రమ పీఠాధిపతు లచే “గురు” పౌర్ణమి పూజోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయా ఆశ్రమాలకు మండలంలోని వివిధ గ్రామాల నుండే కాకుండా ఆర్మూర్ డివిజన్, నిర్మల్ జిల్లాలోని దూర ప్రాంతాల అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కిసాన్ నగర్ లోని భగవాన్ శ్రీ సత్యానంద భక్త జన గీతాశ్రమంలో ఆ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శ్రీహరి తీర్థ స్వాముల వారు చేసిన భక్తి ప్రవచనాలు భక్తుల అందరిని ఆకట్టుకున్నాయి. అన్ని జన్మలో కెల్లా మానవ జన్మ శ్రేష్టమైనదని, ఈ జన్మతోనే జనన, మరణ చక్రాల బందనాల నుండి మానవుడు విముక్తిని పొందే సదవకాశం ఉందని ఆయన ప్రవ చించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కార్యదర్శి అంబల్ల శ్రీనివాస్, సభ్యులు చిలుక జ్ఞానేశ్వర్, మధు, నర్సయ్య, రవి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

నందిపేటలో జరగనున్న పూరి జగన్నాథ రథయాత్ర

janamvelugunews

Published

on

నందిపేటలో జరగనున్న పూరి జగన్నాథ రథయాత్ర

జూన్ 10 జనం వెలుగు: నందిపేట మండల కేంద్రంలో జులై 22వ తేదీన కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర జరగనుందని, ప్రతి ఒక్కరూ ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద రాములు మహారాజ్ కోరారు.

   ఈ సందర్భంగా, కంటేశ్వర్ ఇస్కాన్ రామానంద రాయ్ ప్రభు మాట్లాడుతూ పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర కనివిని ఎరుగని రీతిలో ఇసికేస్తే రాలనంత జనాలతో హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ అంటూ ఆధ్యాత్మిక నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుందని,

    కొందరు ప్రత్యక్షంగా చూసి ఆ జగన్నాథని ఆశీస్సులు పొందుతే,,, మరికొందరు టీవీలలో చూసి తన్మయం చెందుతారని అన్నారు. అంత దూరం వెళ్ళని వారి కొరకు వారి వారి ప్రాంతాల ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్రలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

    అందులో భాగంగానే జులై 22న నందిపేట మండల కేంద్రం లోని వివేకానంద చౌరస్తా నుండి సాయంత్రం 6 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుందని, చాకలి ఐలమ్మ, అంబేద్కర్, నంది, బస్టాండ్ మెయిన్ రోడ్, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సుభాష్ గల్లి సుభాష్ చంద్రబోస్,

    గాంధీనగర్ గాంధీ చౌరస్తాలా విగ్రహాల మీదుగా నాగమంతెన ఫంక్షన్ హాల్ వరకు సాగుతుందని, ఫంక్షన్ హాల్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో రథయాత్ర ముగుస్తుందని, ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు జాతి మత భేదాలు లేకుండా పెద్ద ఎత్తున రథయాత్రలో పాల్గొని ఎవరైతే

    ఆ రథాన్ని లాగుతారో వారికి ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు అందుతాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు, కృష్ణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

నేను అనునది తెలుసుకో…

janamvelugunews

Published

on

గీత భక్త జనాశ్రమం కిసాన్ నగర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీహరి తీర్థ స్వామి.

జనం వెలుగు బాల్కొండ:- నేను అనునది తెలుసుకోవడానికే గురువు ఆశ్రయించాల్సిన అవసరం ఉందని గీతా భక్తాజనాశ్రమం కిసాన్ నగర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీహరి తీర్థ స్వామి అన్నాడు. మండల కేంద్రమైన బాల్కొండ పట్టణంలోని భగవాన్ శ్రీ సత్యానంద స్వామి ఆశ్రమంలో ఆదివారం నిర్వహించిన 495వ సంచార సత్సంగంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించాడు. తాను చేసిన సంపాదనలో 10 శాతం దానధర్మాలను చేయాలని, వాటి ద్వారా పూర్వ జన్మలో తెలిసో తెలి యకో చేసుకున్న పాపాలను కొంత మేరకు కడిగి వేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపాడు.

అన్ని జన్మలలో కెల్లా మానవ శ్రేష్టమై నదని ఈ మానవ జన్మ ద్వారానే జనన మరణ బంధనాలను త్రెంచు కొని, జనన, మరణ చక్రాల బంధనాల నుండి విముక్తి పొందే అవకాశం ఈ ఒక్క జన్మకే ఉందని ఆయన తెలిపాడు. రాగద్వేషాల వలన మనుజుడు అధోగతి పాలవుతాడని, ప్రతీ కారం తీర్చుకోవాలని తపనతో ఉన్న వ్యక్తి జీవితంలో ఏమి సాధించ లేక అన్ని కోల్పోయి దుర్భరమైన జీవితం గడపాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు.

త్యాగం వలన శాంతి లభిస్తుందని అప్పుడే అమర త్వాన్ని పొందుతామని, ఆత్మ సాక్షా త్కారం పొందేందుకే ఈ మానవ జన్మ ఆయన వివరించాడు. నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెటుపల్లి, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్ తథితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ విరజానంధ స్వామి, శ్రీ విశోఖ తీర్థ స్వామి, మాతా పరమేశ్వరి, మాతా సూరతా నందితా తదితరులు ప్రవచించారు.

Continue Reading

నిజామాబాద్

బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

janamvelugunews

Published

on

బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

జనం వెలుగు, నిజామాబాద్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ పర్యవేక్షించారు.

ఉప ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు జరగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ బందోబస్తు ఏర్పాట్లలో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితె, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading