Connect with us

Crime

హత్య కేసులో నిందితుడికి జీవిత కాలం”కటిన కారాగార శిక్ష

janamvelugunews

Published

on

హత్య చేసిన కేసులో నేరస్తునికి జీవిత కాలం”కటిన కారాగార జైలు శిక్ష తోపాటు 1000/- రూపాయల జరిమానా

జనం వెలుగు కుంటాల:- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని రాజాపూర్ తాండాకు చెందిన నేరస్తుడు అయినటువంటి చవాన్ సుధాకర్ ఊర్లో ఏ పని చేయకుండా జులై గా తిరుగుతుండేవా ఆరు నెలల క్రితం ఫిర్యాదుదారుడైన జాదవ్ సంజయ్ నకు, నేరస్తునికి కుంటాల బస్టాండ్ ల ఎదురుగా ఉన్నటువంటి వైన్ షాప్ వద్ద బియ్యం బస్తా విషయంలో మాట మాట పెరిగి కొట్టుకున్నారు. తరువాత అదే రోజు సాయంత్రం గ్రామంలోని ఫిర్యాదుదారుని ఇంటి వద్దకు వచ్చి ఫిర్యాదుదారున్ని, వారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు బూతు మాటలు తిట్టి చేతులతో కొట్టినాడు అప్పుడు గ్రామంలోని పెద్ద మనుషులు వచ్చి సర్ది చెప్పి సముదాయించినారు ఇట్టి గొడవలు మనసులో పెట్టుకొని వారి కుటుంబంలో ఎవరినైనా ఒకరిని చంపుతానని గ్రామస్తులతో అంటూ ఉండేవాడు ఇదే విషయంలో సుధాకర్ ఒంటరిగా ఆడుకుంటున్న ఫిర్యాదిదారుడైన కుమారుడు మృతుడు అయినటువంటి ఇతీష్ ను పాత కక్షలు మనసులో పెట్టుకొని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో స్కూలు వెనుకాల గల రాథోడ్ దత్తు మొక్క చేనులోకి తీసుకువెళ్లి అతనికి మాయమాటలు చెప్పి బండరాయితో ముఖంపై గట్టిగా కొట్టి చంపినాడు ఇట్టి విషయంలో ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా, అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి అనంతరం నేరస్తునిఅరెస్టుచేసి, పరిశోదన చేసిన చార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేయగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్వకుంట్ల వినోద్ రావు 13 మందిని సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, సాక్షులు చెప్పిన సాక్షం కోర్టులో రుజువు కావడం వల్ల, నిర్మల్ జిల్లా ప్రధాన న్యయమూర్తి A.కర్ణ కుమార్ నిర్మల్ నేరస్తుడు అయినటువంటి చవ్వాను సుధాకర్ కు జీవిత కాలం కటిన కారాగార జైలు శిక్షతోపాటు ఒక్కరికీ 1000/- వేయిల రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ ఈ రోజు సోమవారం తీర్పు వెల్లడించారు. నేరస్తున్నికి శిక్ష పడడంలో కృషి చేసిన IO మందిని, కోర్టు పొలీస్ సిబ్బందినీ జిల్లా ఎస్పీ అభినందించారు.

Crime

జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..

janamvelugunews

Published

on

జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..

 కాని తాను.. విసిరే వల.. తన మడకే చుట్టుకొని తననే కాటేస్తదనుకోలేదు ఆ గంగా పుత్రుడు. అటువంటి దురదృష్ట ఘటన ఒకటి డొంకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది.

 నందిపేట్ సెప్టెంబర్ 30 జనం వెలుగు:- నిజమాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయి కట్ట గణేష్ (37) సోమవారం ఎస్ఆర్ఎస్పి ముంపు ప్రాంతం గంగాసముందర్ గ్రామ శివారు గంగలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాద వశాత్తు వల చుట్టుకొని మరణించడం జరిగింది. స్థానిక ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…

   కట్ట గణేష్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేడు, మంగళవారం ఉదయం 7 గంటల 30 ని:కు గంగ సముందర్ గ్రామ శివారు గంగాలో శివమై తేలినాడని

  గణేష్ భార్య కట్ట కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి కొడుకు యోగేష్, కూతురు హన్సిక కలరని ఆయన అన్నారు. గంగాపుత్రులకు వారి వలలే వారికి శాపంగా మారి తరచూ మృత్యువాత పడుతున్నారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్స్యశాఖ తగు చర్యలు చేపట్టలని, ఆ వలల బారిన పడకుండా ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని ప్రజల అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

Crime

మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..

janamvelugunews

Published

on

మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..

నందిపేట్ సెప్టెంబర్ 19 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రూరల్ నార్త్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మాక్లూర్ మండలం మణిక్ బండార్ గ్రామ

  శివారులో గల గండ్ర రివర్ వ్యూ అనే రియల్ ఎస్టేట్ వెంచర్కు సంబంధించిన లావాదేవీల్లో దాదాపు 8 కోట్ల వరకు లెక్కలు తారుమారు అయ్యాయని వెంచర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంతోష్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

అయితే సంతోష్ గౌడ్ సర్పంచ్ కాకముందు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వెంచర్లో ఉద్యోగం చేసేవాడని యాజమాన్యానికి తెలియకుండా మరికొంత మంది వ్యక్తులతో కలిసి ప్లాట్లు లావాదేవీలు చేసే పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచాడేమోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

ఏది ఏమైనా గ్రామ ప్రథమ పౌరుడు సేవా దృక్పథం, తమ ప్రజలకు ఎవరైనా మోసం చేస్తే ముందు నిలబడే నాయకుడుగా ఉండాలని కోరుకుంటారని, అలాంటి ప్రథమ పౌరుడు పైనే మోసం కేసు నమోదవడం తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Continue Reading

Crime

Big breaking news నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….

janamvelugunews

Published

on

నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….

 స్వతంత్ర వేడుకలకు స్వాగతం పలుకుతూ… రోడ్డుపైనే సిరంజీ సూదులు

 మండల కేంద్రం నంది విగ్రహం వద్ద రోడ్డుపై వందలాది సూదులు

 నందిపేట్ ఆగస్టు 15 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర నంది విగ్రహం వద్ద శనివారం ఉదయాన్నే నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదరులు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. నేడు స్వాతంత్ర వేడుకలు సందర్భంగా గ్రామపంచాయతీ వారు రాత్రి నుండే మండల కేంద్రం రోడ్లన్నీ శుభ్రపరిస్తే ఉదయాన్నే రోడ్డంతా ఉపయోగించిన సిరంజీ సూదులు విచ్చలవిడిగా పడి ఉండడంతో పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది.

  హాస్పిటల్స్ లో ఉపయోగించే ఈ ఇంజక్షన్ల నీడిల్సు వాడిన తర్వాత బయో మెడికల్ వేస్టేజ్ బాక్స్ లో వేసి ఎంతో జాగ్రత్తగా డంపు యార్డుకు తరలించాల్సి ఉంటుంది. ఈ యూజుడ్ ఇంజక్షన్స్, నీడిల్స్ ద్వారా హెచ్ఐవి, హెపటైటీస్ బి/సి లాంటి ఇన్ఫెక్షన్స్ జరిగే ప్రమాదం ఉంది.

  కానీ మండల కేంద్రంలో మాత్రం విచ్చలవిడిగా పి ఎంపీ, ఆర్ఎంపీ ల పేరిట గల్లీకో దవఖాన పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కనీసం మెడికల్ నిబంధనలను కూడా పాటించకుండా ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం ఇటువంటి వారిపై అధికారులు చర్య తీసుకోవాలని ప్రతి హాస్పిటల్స్ లో బయో మెడికల్ వేస్టేజ్ బాక్సులు ఉండేటట్టు చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading