నిజామాబాద్
పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలి


పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలి
మళ్ళీ భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
చెరువులు, కుంటలు చెక్ డ్యాంలు ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాలి
రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో మాజి మంత్రి,ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి
జనం వెలుగు, బాల్కొండ:- రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన బాల్కొండ నియోజకవర్గ పరిస్థితులపై రెవెన్యూ, ఇరిగే షన్, వ్యవసాయ శాఖ అధికారులతో బాల్కొండ ఎంఎల్ఏ మాజి మంత్రి ప్రశాంత్ రెడ్డి గురువారం బాల్కొండ ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన నియో జకవర్గములో పరిస్థితిని ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. నియోజకవర్గంలో చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్ ల పరిస్థితి ఎలా ఉందని, ఎంఎల్ఏ అధికారులను ప్రశ్నించగా సవ్యంగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాలలోని చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రశాంత్ రెడ్డి తెలిపాడు. పంట నష్టంపై మెండోరా మండలం బుస్సాపూర్ లో సుమారు 40 ఏకరాల్లో గ్రౌండ్ నట్ పంట, వేల్పూర్ మండలము మోతెలో 10 ఎకరాల్లో వరి, పచ్చల నడుకుడా గ్రామంలో 5 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవ సాయ శాఖ అధికారులు తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వానికి ఓ నివేదిక అందించాలని ఎంఎల్ఏ అధికా రులను ఆదేశించాడు. పంటలు చేతి కొచ్చే సమయాన మళ్ళీ వర్షాలు కురిస్తే పంట నష్టం చాలా పెరిగే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నాడు. ప్రస్తుతము కురిసిన వర్షాలతో బాల్కొండ నియోజకవర్గంలో పెద్దగా ఆస్థి, ప్రాణం నష్టం జరుగలేదని రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, మండల కేంద్రమైన మోర్తాడ్ లోని మొండి వాగు ప్రవాహంలో ప్రమాదవశాత్తు గల్లంతు అయ్యి చనిపోయిన వ్యక్తి కామారెడ్డికి చెందిన రైతు కూలి వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన అధికారులను ఆదేశిం చాడు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డిఓ రాజాగౌడు, ఏడిఎ శ్రీనివాస రాజు, వివిధ మండలాల తహసిల్దార్ లు, ఇరిగేషన్ డిఇ సురేష్, వివిధ మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఏఇలు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
పేదవానికి చదివే వజ్రాయుధం


పేదవానికి చదివే వజ్రాయుధం
జనంవెలుగు, నందిపేట్ జూన్ 18:- గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట మండల కేంద్రంలో పర్యటించి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జాతీయస్థాయి స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులకు స్థానిక మోడల్ స్కూల్లో మెమొంటోను అందజేశారు.
8 తరగతి చదువుతున్న చేపూర్ శ్రీహిత, పాణెం హర్షిత, గొల్లపల్లి అలంకృత, రాచ కనిష్క్ లు మోడల్ స్కూల్లో చదివి జాతీయస్థాయి స్కాలర్షిప్ సొంతం చేసుకోవడం చాలా సంతోషం అంటూ వారిని ఘనంగా శాలువాతో సత్కరించి ఆ పిల్లల తల్లిదండ్రులను, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. డబ్బున్న వాడికి డబ్బుతో పాటు విద్యా, వైద్యం, విలాసం ఇలా రకరకాల సదుపాయాలన్నీ సమృద్ధిగా అందుతాయని డబ్బు లేని వానికే విద్యా వైద్యం విలాసం ఇలా అన్ని భారంగా మారుతాయి అని, అందుకే ప్రతి పేదవానికి విద్య అనేది వజ్రాయుధం లాంటిదని, విద్యతోనే ధనికునితో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొచ్చని,
సమాజంలో మంచి గౌరవం అందుతుందని అందు కొరకు అహర్నిశలు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. కటిక పేదరికమైన చదువు అనే వజ్రాయుధంతో తలరాతను మార్చుకోవచ్చని, అందుకే ఏ ఒక్క విద్యార్థి కూడా నిరాశ నిస్సృహ చెందకుండా చదువుపై మంచి ద్యాస పెట్టి లక్ష్యాలను చేదించాలని,
నిరుపేదగా పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది విద్యార్థుల ఘాతను ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను చేదించాలన్నారు. మొన్నటికి మొన్న ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ అనే ఒక 15 ఏళ్ల కుర్రాడు సిక్సులు బాదుతుంటే యావత్ ప్రపంచమంతా నివ్వరపోయిందని, అతి చిన్న వయసులో ఎన్నో రికార్డులను అధిగమించాడని,
ఆ బుడ్డోడు సాధించిన ఘనతల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు పడ్డ బాధలు, ఆ బాలుడి పట్టుదల ఆ ఘనతను సాధించేలా చేసిందని ఉదాహరించాడు. జాతీయస్థాయి స్కాలర్షిప్ పొందిన పిల్లలు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాలు సంవత్సరంకు 12 వేల రూపాయల చొప్పున 48 వేల రూపాయలను పొందుతారని ఆయన అన్నారు.
అందుకే నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకు అనునిత్యం అసెంబ్లీలో నిరుపేదలకు విద్య, వైద్యంపైనే మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. నిరుపేదలంటే ఇష్టమని ఆ నిరుపేదలకు విద్యా వైద్యం అందకపోతే ఊరుకోనని, పేద విద్యార్థుల కొరకు అహర్నిశలు పాటుపడతానన్నారు.
అలాగే గురువులు కూడా ప్రతి పేద విద్యార్థిని తమ పిల్లలుగా అనుకొని నిత్యం వారి వెన్నంటా ఉండి మంచి విద్యా బోధన చేస్తూ మెరకల్లాంటి విద్యా కుసుమాలను తయారు చేయాలని, కుల మత ధన తారతమ్యాలను పక్కనపెట్టి, మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ దేశభక్తి గల పౌరులను తయారుచేసి దేశానికి అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈఓ అవధూత గంగాధర్, సర్పంచ్ సిలిండర్ లింగం, మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్, నందిపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పటేళ్ల రాజు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి


టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి
నిజామాబాద్ ఆర్ టి సి నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి బాధ్యతల చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా భాద్యతలు చేపట్టిన వెంటనే పి. జ్యోతి నిజామాబాద్ బస్ స్టేషన్, డిపోలను సందర్శించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణీకుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో పర్సనల్ ఆఫీసర్ పద్మజ, ఏ.ఓ. బి. స్వరూప, నిజామాబాద్ 1 డి ఎం ఆనంద్, నిజామాబాద్ 2 డి ఎం, జి ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి, బాన్స్ వాడ డి ఎం రవికుమార్, కామారెడ్డి డి ఎం దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, నిజామాబాద్ 1డిపో సి ఐ జనాభాయి, ఎం ఎఫ్ వసుంధర, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి


మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, జూన్ 16: మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.
ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఆసుపత్రిలో సంఘటన చోటుచేసుకుంది, మరణం సంభవించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ, వైద్య సేవలలో ఏమైనా లోపం జరిగిందా అని ఆరా తీస్తూ, రికార్డులను పరిశీలించారు. మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ సంఘటన జరిగినా లోతుగా పరిశీలన జరుపుతామని, నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించినట్టు వెల్లడి అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుపుతూ, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్ళిన పక్షంలో వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు,
అంగన్వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్ళను సందర్శించి ఆరోగ్య స్థితిని వాకబు చేయాలని అన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో తప్పనిసరిగా తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వైద్య పరీక్షలు, చికిత్సలు అందించే విషయంలో ఎలాంటి లోపం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్త హీనత, బీ.పీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని, అవసరమైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడాలని సూచించారు. కాన్పు సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో తల్లి మరణిస్తే, బాధిత కుటుంబం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ,టి.వినయ్ డీ.సీ.హెచ్.ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, స్వంచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








