మెదక్
మూఢ నమ్మకాలపై అవగాహన


విజ్ఞానంతో మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యం
దొంగ బాబాలను నమ్మకూడదు: ఎస్సై యాదగిరి
సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు నరేష్
జనంవెలుగు, చిలిపిచేడు:- విజ్ఞానంతో మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యమని దొంగ బాబాలను నమ్మకూడదని ఎస్సై యాదగిరి, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో చిలిపిచేడు మండల పరిధిలోని చిట్కుల్ కస్తూర్బా బాలికల విద్యాలయం నందు వ్యక్తిత్వ వికాసం- సైన్సు- మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్సై యాదగిరి, ఉప్పులేటి నరేష్ హాజరై మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను విద్యార్థులు వదిలిపెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని. దొంగ స్వాములు భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. డ్రగ్స్ మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉప్పులేటి నరేష్ మాంత్రికులు భూత వైద్యులు మోసం చేసే కుట్రలను సైన్స్ మ్యాజిక్ షో ద్వారా విద్యార్థులకు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మిస్బావుద్దిన్, పోలీస్ సిబ్బంది అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
మెదక్
చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ


చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ
జనం వెలుగు చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (MPDO) బానోత్ ప్రవీణ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు MPDOగా విధులు నిర్వహించిన ప్రశాంత్ స్థానంలో ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతల బదిలీ అనంతరం మాజీ MPDO ప్రశాంత్ కొల్చారం మండల పంచాయతీ అధికారిగా (MPO) నియమితులయ్యారు. అనంతరం కొల్చారం మండల పంచాయతీ కార్యాలయంలో MPOగా బాధ్యతలు స్వీకరించారు.
చిలిపిచేడ్ మండలానికి నూతన MPDOగా బాధ్యతలు చేపట్టిన బానోత్ ప్రవీణ్‌కు మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
మెదక్
చిట్కుల్లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం


చిట్కుల్లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం
జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి చిట్కుల్ గ్రామంలోని వినాయక మండపాలకు ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సుమారు 8 వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులకు మొత్తం రూ.80 వేల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తారా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామ ఉప సర్పంచ్ ఎండీ అఖిల్, మాజీ సర్పంచ్ భూమయ్య, ముక్క అశోక్, బాగయ్య, ప్రవీణ్, కొమురయ్యతో పాటు పలువురు యువకులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మెదక్
చిట్కుల్లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం


చిట్కుల్లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం
ప్రతి గురువారం సంత నిర్వహణ.. తక్కువ ధరలకు నాణ్యమైన మేకలు, గొర్రెలు
జనంవెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో గురువారం మేకలు, గొర్రెల సంతను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో ప్రతి గురువారం మేకలు, గొర్రెలను విక్రయించుకునేలా సంతను ఏర్పాటు చేసినట్లు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు.
ఈ సంత ద్వారా చిట్కుల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు తమ పశువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే కొనుగోలుదారులకు నాణ్యమైన మేకలు, గొర్రెలు అందుబాటు ధరల్లో లభించేలా మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి గురువారం సంత నిర్వహణతో గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులకు మంచి మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.








