మెదక్
బక్రీద్ పండుగను సామరస్యంతో జరుపుకోవాలని సూచించిన ఎస్ఐ నర్సింలు


బక్రీద్ పండుగను సామరస్యంతో జరుపుకోవాలని సూచించిన ఎస్ఐ నర్సింలు
జనంవెలుగు, చీలిప్ చేడ్:- చిలిప్ చేడ్ మండలంలో మంగళవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరు మతాల పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై నర్సింలు మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ సామరస్యాన్ని పాటించాలి. మత సామరస్యం ద్వారా సమాజంలో శాంతి చేకూరుతుంది. బక్రీద్ సందర్భంగా గోవధను పూర్తిగా నివారించాలి. ఇతర మతాలను గౌరవించుకోవడం మన బాధ్యత, అని అన్నారు. అంతేగాక, ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, పోలీసులకు సహకరిస్తూ, కోవిడ్ నిబంధనలు తప్పక పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను నమ్మవద్దని, అవాంఛనీయ ఘటనలకుగానీ సమస్యలకుగానీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. చట్టాన్ని అతిక్రమించి అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మెదక్
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ


ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ
జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.
రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక


ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక
జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.
మెదక్
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్


అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్
జనంవెలుగు, చిలప్ చెడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.
రక్తదాత సుఖీభవ








