Crime
కాసులు ఇచ్చుకోండి.. కావలసినంత తొవ్వుకోండి…?


రుద్రూర్ మండల అధికారుల వింత వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు..
ఎర్ర బంగారం (మొరం) దోపిడీలో అధికార పార్టీ నేతలకూ వాటా ఎంత…?


అక్బర్ నగర్ పరిధిలోని భూముల్లో నుంచి టిప్పటర్లకు మొరం నింపుతున్న హీటాచీలు
జనం వెలుగు, రుద్రూర్:- కోట్ల రూపాయల విలువచేసే ఎర్ర బంగారాన్ని (మొరం) కొంతమంది అక్రమార్కులు అడ్డగోలుగా దోచుకు పోతున్నారు.రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా మొరం త్రవ్వకాలు చేపడుతూ గుట్టలను కొల్లగొడుతున్నారు. బుధవారం అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో అనుమతులు లేకుండా మొరం త్రవ్వకాలు చేపడుతుండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. 765 -డి జాతీయ రహదారి నిర్మాణం పేరిట కొన్ని నెలలుగా అక్రమంగా మొరం త్రవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మొరం(గ్రావెల్) మట్టి తవ్వకాలు చేయాలి అంటే ప్రభుత్వ నిబంధనలతో పాటు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో నగదు చెల్లిస్తేనే రెవిన్యూ,మైనింగ్ అధికారులు అనుమతి ఇస్తారు.. కానీ రుద్రూర్ మండలంలో ప్రభుత్వఅధికారల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో మొరం త్రవ్వకాలు చేపడుతున్న మండల అధికారులు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు అడ్డుకునే వరకు తవ్వకాలు జరిగే స్థలానికి రాలేదని వచ్చిన పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జేసీబీ, టిపర్ వాహనాలను సీజ్ చేయక పోవడం వెనుక అంతర్యం ఏమిటోనని కాంట్రాక్టర్ నుండి భారీ ముడుపులు అందుకోవడం వల్లనే అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని అక్బర్ నగర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలకు వాటాలు ఉండడంతో అందరూ అధికారులు మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలగా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ పంచాయతీలో జరుగుతున్న విచ్చలవిడి మొరం (గ్రావెల్) తవ్వకాలపై గ్రామ ప్రజలతో పాటు రైతాంగం కట్టలు తెచ్చుకునే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా… ఈ దోపిడీ వల్ల ప్రభుత్వా అధికారులకు చెడ్డపేరు వస్తున్నా… దోపిడీలో తగ్గేదేలే అంటూ ఎర్ర బంగారం పుష్పాలు చెలరేగిపోతున్నారు. నేను ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంపై తాసిల్దార్ తరాబాయికి వివరణ కోరగా మొరం త్రవ్వకాలకొరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని త్రవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదని, ఈ రోజు తెలిసిందని మేము అక్కడికి వెళ్లలేదని పోలీసులు వెళ్లారు వాహనాలు సీజ్ చేయడం వారికే తెలుసనీ సమాధానం ఇచ్చారు. అదేవిధంగా ఎస్సై సాయన్నకు వివరణ కోరగా త్రవ్వకాల జరుగుతున్న స్థలానికి పోలీస్ సిబ్బంది వెళ్లారని భూమిని చదును చేస్తున్నారని మొరాన్ని అక్కడే పోస్తున్నారని, బయటకు తేవడం లేదని మొరం త్రవ్వకాల విషయం తహసీల్దార్ కే తెలుస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








