మెదక్
చిట్కుల్ చౌరస్తా వద్ద రైతుల ధర్నా


యూరియా సరఫరా చేయాలంటూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం
జనం వెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ చౌరస్తా వద్ద యూరియా కోసం రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రోడ్లపైకి దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే వాకీటి సునీత లక్ష్మారెడ్డి కూడా పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతులు నినాదాలు చేస్తూ యూరియా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. పది రోజులుగా రైతులు యూరియా కోసం తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఆమె హెచ్చరించారు. ఈ ధర్నాతో పరిస్థితులు ఉద్రిక్తం కావడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆందోళనకారులను నచ్చజెప్పారు. కొంతసేపటి గందరగోళం అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మెదక్
చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ


చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ
జనం వెలుగు చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (MPDO) బానోత్ ప్రవీణ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు MPDOగా విధులు నిర్వహించిన ప్రశాంత్ స్థానంలో ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతల బదిలీ అనంతరం మాజీ MPDO ప్రశాంత్ కొల్చారం మండల పంచాయతీ అధికారిగా (MPO) నియమితులయ్యారు. అనంతరం కొల్చారం మండల పంచాయతీ కార్యాలయంలో MPOగా బాధ్యతలు స్వీకరించారు.
చిలిపిచేడ్ మండలానికి నూతన MPDOగా బాధ్యతలు చేపట్టిన బానోత్ ప్రవీణ్‌కు మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
మెదక్
చిట్కుల్లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం


చిట్కుల్లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం
జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి చిట్కుల్ గ్రామంలోని వినాయక మండపాలకు ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సుమారు 8 వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులకు మొత్తం రూ.80 వేల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తారా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామ ఉప సర్పంచ్ ఎండీ అఖిల్, మాజీ సర్పంచ్ భూమయ్య, ముక్క అశోక్, బాగయ్య, ప్రవీణ్, కొమురయ్యతో పాటు పలువురు యువకులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మెదక్
చిట్కుల్లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం


చిట్కుల్లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం
ప్రతి గురువారం సంత నిర్వహణ.. తక్కువ ధరలకు నాణ్యమైన మేకలు, గొర్రెలు
జనంవెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో గురువారం మేకలు, గొర్రెల సంతను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో ప్రతి గురువారం మేకలు, గొర్రెలను విక్రయించుకునేలా సంతను ఏర్పాటు చేసినట్లు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు.
ఈ సంత ద్వారా చిట్కుల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు తమ పశువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే కొనుగోలుదారులకు నాణ్యమైన మేకలు, గొర్రెలు అందుబాటు ధరల్లో లభించేలా మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి గురువారం సంత నిర్వహణతో గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులకు మంచి మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.








