మెదక్
అంజిరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పాఠశాలకు టేబుల్స్, చైర్స్ అందజేత


బహుకరించిన కాంగ్రెస్ నాయకులు తార విష్ణువర్ధన్ రెడ్డి
విద్యార్థులకు అందజేసిన ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి
జనం వెలుగు చిలిపిచేడ్ :- చిలిపిచేడ్ మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక ఉన్నత పాఠశాల లకు తార అంజిరెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో పాఠశాలలకు 7 టేబుల్స్ 30 చైర్స్ మూడు బ్యాండ్లు ఒక ఆమ్ప్లిఫైర్ హౌజా 2 బాక్సులు ఒక లాప్టాప్ ఇందులో భాగంగా గ్రామపంచాయతీకి సంబంధించిన వీధిలైట్లు గ్రామానికి సరిపడా వీధిలైట్లు అందజేశారు. మొత్తం సామాగ్రి సుమారుగా రూ. ఒక్క లక్ష 30 వేల విలువగల సామాగ్రిని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి పాఠశాలకు డొనేట్ చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తార అంజిరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో చిలిపిచేడ్ మండల యువ నాయకులు తార విష్ణువర్ధన్ రెడ్డి తన పుట్టిన ఊరు, పాఠశాల బాగుండాలని మంచి మనసుతో పాఠశాల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ప్రేమ అభిమానాలతో రెండు పాఠశాలలకు సంబంధించి తనకు తోచినంతలో పాఠశాలలకు టేబుల్స్ చైర్లు ఇతర సామాగ్రిని విరాళంగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఇలాంటి సహృదయం ఉన్న నాయకులు గ్రామానికి ఒక్కరు ఉంటే ఎంతో బాగుంటుందని కొనియాడారు. తారా విష్ణువర్ధన్ రెడ్డి తన సొంత నిధులతో పాఠశాలకు విరాళంగా ఇచ్చిన సామాగ్రిని మా చేతుల మీదుగా అందియడం ఎంతో ఆనందంగా ఉందని ఇలాంటి యువ నాయకులను ఆదర్శంగా తీసుకొని మన మండలంలోని పలు గ్రామాలలో యువకులు ఆదర్శంగా నిలవాలని ఎవరి గ్రామాలకు వారు ఎంతో కొంతగా ఇలా స్వచ్ఛందంగా సేవలు చేస్తే ఏ ప్రభుత్వమైన పని చేయాలని ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్
చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ


చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ
జనం వెలుగు చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (MPDO) బానోత్ ప్రవీణ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు MPDOగా విధులు నిర్వహించిన ప్రశాంత్ స్థానంలో ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతల బదిలీ అనంతరం మాజీ MPDO ప్రశాంత్ కొల్చారం మండల పంచాయతీ అధికారిగా (MPO) నియమితులయ్యారు. అనంతరం కొల్చారం మండల పంచాయతీ కార్యాలయంలో MPOగా బాధ్యతలు స్వీకరించారు.
చిలిపిచేడ్ మండలానికి నూతన MPDOగా బాధ్యతలు చేపట్టిన బానోత్ ప్రవీణ్‌కు మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
మెదక్
చిట్కుల్లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం


చిట్కుల్లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం
జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి చిట్కుల్ గ్రామంలోని వినాయక మండపాలకు ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సుమారు 8 వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులకు మొత్తం రూ.80 వేల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తారా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామ ఉప సర్పంచ్ ఎండీ అఖిల్, మాజీ సర్పంచ్ భూమయ్య, ముక్క అశోక్, బాగయ్య, ప్రవీణ్, కొమురయ్యతో పాటు పలువురు యువకులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మెదక్
చిట్కుల్లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం


చిట్కుల్లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం
ప్రతి గురువారం సంత నిర్వహణ.. తక్కువ ధరలకు నాణ్యమైన మేకలు, గొర్రెలు
జనంవెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో గురువారం మేకలు, గొర్రెల సంతను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో ప్రతి గురువారం మేకలు, గొర్రెలను విక్రయించుకునేలా సంతను ఏర్పాటు చేసినట్లు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు.
ఈ సంత ద్వారా చిట్కుల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు తమ పశువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే కొనుగోలుదారులకు నాణ్యమైన మేకలు, గొర్రెలు అందుబాటు ధరల్లో లభించేలా మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి గురువారం సంత నిర్వహణతో గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులకు మంచి మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.








