Connect with us

Crime

సమిష్టి కృషితో నేరాల నియంత్రణ: సీపీ సాయి చైతన్య

janamvelugunews

Published

on

వార్షిక క్రైమ్ రిపోర్ట్ వెల్లడించిన సిపి

జనం వెలుగు, నిజామాబాద్ డిసెంబర్ 31: పోలీసు సిబ్బంది అంకితభావం, ప్రభుత్వ విభాగాల సమన్వయం, ప్రజల సహకారంతో నేరాల నివారణకు కృషి చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం 2025 వార్షిక క్రైమ్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను వెల్లడించారు.

గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఓవరాల్ క్రైమ్ రేటు తగ్గినట్లు తెలిపారు. 2024లో మొత్తం 8983 వివిధ రకాల నేరాలు నమోదు కాగా, 2025లో అవి 8624కు తగ్గినట్లు వివరించారు. అయితే పిల్లలపై జరిగే నేరాలు 120 నుంచి 168కు పెరిగినట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చినట్లు సీపీ పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టడంతో ప్రమాదాల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. గతేడాది 857 రోడ్డు ప్రమాదాలు జరగగా 353 మంది మృతి చెందారు, 782 మంది గాయపడ్డారు. 2025లో 780 ప్రమాదాలు చోటుచేసుకోగా 276 మంది మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదాల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యను కూడా తగ్గించగలిగామని చెప్పారు.

డ్రంకెన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. నిరంతరం నిర్వహిస్తున్న తనిఖీల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణలో ఇవి కీలకంగా మారాయని అన్నారు. గతేడాది 8410 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 2025లో విస్తృత తనిఖీలతో ఆ సంఖ్య 17,627కు చేరినట్లు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం డ్రైవర్‌కే కాకుండా ఇతరులకూ ప్రమాదకరమని, దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

డ్రగ్స్‌పై యుద్ధం చేయడమే రానున్న సంవత్సరానికి ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, వాటిని మరింత విస్తరించనున్నట్లు చెప్పారు.

నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారులను ఆనుకొని ఉండటంతో అంతరరాష్ట్ర దొంగల కదలికలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు డైనమిక్ పేట్రోలింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. వరదలు వంటి విపత్తుల సమయంలో తక్షణ సహాయం అందించేందుకు పోలీస్ శాఖ నుంచే డీడీఆర్ఎఫ్ ఫోర్సును సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలపై మాట్లాడుతూ, సంబరాలు చేసుకోవడాన్ని పోలీస్ శాఖ అడ్డుకోదని, కానీ హద్దులు మీరకూడదని సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.10 వేలకుపైగా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సైబర్ క్రైమ్ ఏసీపీ వై. వెంకటేశ్వర్ రావ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, సీసీఆర్బి సీఐ వీరయ్య, ఐటీ కోర్స్ సిబ్బంది, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Crime

వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

janamvelugunews

Published

on

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రూ.11.10 లక్షల జరిమానా విధింపు – 9 మందికి జైలు శిక్ష

జనం వెలుగు, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గడిచిన వారం రోజుల్లో 138 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.

తేదీ 25-05-2026 నుండి 30-05-2026 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 138 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 9 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.11,10,000 జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

పోలీస్ కమిషనర్ సూచనలు:

• మద్యం సేవించి వాహనాలు నడపరాదు.

• వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలి.

• డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడుతుంది.

• మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా ప్రయోజనాలు లభించవు.

• మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

• ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది.

మోటార్ వెహికల్ యాక్ట్–1988 సవరణ చట్టం–2019 ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చని, రెండోసారి పట్టుబడితే రూ.15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు.

Continue Reading

Crime

|crimenews నందిపేట మండల కేంద్రంలో చోరీ….

janamvelugunews

Published

on

నందిపేట మండల కేంద్రంలో చోరీ….

పొద్దున పొద్దున్నే 10 తులాల బంగారం రెండు లక్షల నగదు అపహరణం….

కట్ట పనికి వెళ్లొచ్చే సరికే కానిచ్చేశారు..

నందిపేట్ మే 28 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర నాగమంతెన సంఘం దగ్గర కాలనీలో నివాసం ఉంటున్న నడ్కుడ రాధా ఇంట్లో చోరీ జరిగింది.

   బుధవారం సుమారు ఉదయం 7- 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సుమారు 10 తులాల వరకు బంగారం 2 లక్షల రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నడ్కుడ రాధ భర్త చనిపోయి చాలా రోజులవుతుంది, తన తల్లి కొడుకుతో నాగ మంతెన సంఘం వద్దగల కాలనీలో నివాసం ఉంటుంది.

    అయితే బుధవారం ఉదయం కట్ట పనికొరకంటూ కొడుకు బండిమీద వెళ్ళింది. కాసేపటికి రాదను దింపేసి రాజు ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్లీ యధావిధిగా పొలం పనికి వెళ్ళాడు. వృద్ధురాలైన రాధాత తల్లి ఇంట్లో ఒక్కతే ఉంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో తల్లి కొడుకులు ఇద్దరు ఇంటికి వచ్చారు. వీరు నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి గురించి చర్చించుకొని మేస్త్రి డబ్బులు కట్టమన్నాడని,

   మేస్త్రీకి డబ్బులు ఇచ్చేందుకు బీరువాలో ఉన్న నగదును చూసుకునేందుకు బీరువా దగ్గరికి వెళ్లగా బీరువా తాళం చేయి కనిపించలేదు. అనుమానం వచ్చి ఒకరికొకరు వాకబు చేసుకున గా బీరువా తాళం చేయి కనిపించే పోయేసరికి బీరువాతాలాన్ని పగలగొట్టి చూడడంతో అందులో ఉన్న బంగారం నగదు కనిపించక పోయేసరికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

   మా అమ్మ నేను బయటకెళ్ళిచ్చేసరికి మా అమ్మమ్మను పక్కింటి వ్యక్తి ఒకరు బయటకు తీసుకెళ్లడం జరిగిందని, ఆ వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు నడ్కుడ రాజు. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Crime

|crimenews మంటగలిసిన మాతృత్వం 

janamvelugunews

Published

on

మంటగలిసిన మాతృత్వం 

ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం 

నందిపేట్ మే 24 జనం వెలుగు: మాతృత్వం మంట కలిసింది.. ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ రెహిమానియా మజీద్ ప్రాంతం

హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా మండుటెండలో విసిరేసి వెళ్లడం జరిగింది. వివరాల్లోకి వెళితే మెయిన్ రోడ్డు లో గల పాత హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో పసికందును ఘర్కశంగా విసిరేశారు.

స్థానిక చిన్నపిల్లలు క్రికెట్ ఆడదామని గేటు పైనుంచి ఆ నిర్మాణస్య ప్రాంతంలో వెళ్లేసరికే అక్కడ ఒక పసి గుడ్డు ఏడుపులు విని వెంటనే అసిఫాన్ అనే బాలుడు వాళ్ళ అమ్మ నాన్నకు తెలపడంతో వెంటనే వాళ్లు ఆ పసి గుడ్డును హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది.

అయినా పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో ఆ పసి గుడ్డు మరణించడం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆడపిల్ల అనే నెపంతోనో.. లేదా అక్రమ సంబంధమో..

తెలియదు కానీ అభం శుభం తెలియని ఆ చిన్నారిని మండుటెండలో విశ్రేయడం మాతృత్వానికే మచ్చ అని ఇటువంటి చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Continue Reading