Connect with us

నిజామాబాద్

డైరీ ఆవిష్కరణకై, తరలి వెళ్తున్న విద్యుత్తు బిసి నాయకులు

janamvelugunews

Published

on

డైరీ ఆవిష్కరణకై, తరలి వెళ్తున్న విద్యుత్తు బిసి నాయకులు

జనం వెలుగు ఆర్మూర్:- వరంగల్ లో శనివారం ఆవిష్కరించే విద్యుత్తు డైరీ ఆవిష్కరణకై ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలలో నుండి విద్యుత్తు బిసి నాయకులు తరలివెళ్తున్నారు. డైరీ ఆవిష్కరణ కోసం రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బిసి నాయకులు పొన్నం ప్రభాకర్, ఈటెల రాజేందర్, కొండా సురేఖ తథితరులు హాజరయ్యే డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బిసిలు తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఆర్మూర్ డివిజన్ విద్యుత్తు బిసి ప్రధాన కార్యదర్శి టి నర్సయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు సిఎచ్ దేవయ్య, గంగారాం, వేణుగోపాల్, గోపాల స్వామి,సీతా రాములు, ప్రవీణ్ కుమార్, రాజ్ కుమార్, రమేష్, ఈశ్వర్, బాబురావు తదితరులు బయలు దేరారు. బిసిల సమస్యలను పరిష్కరించుకోవాలని గత కొన్నాళ్లుగా కంటున్న కలలను సాకారం చేసుకునే దిశగా పయనిం చాలని బిసి నాయకులు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని బిసి నాయకులు కోరారు.

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading