Connect with us

నిజామాబాద్

| Balkond హామీల అమలులో కాంగ్రెసు విఫలం

janamvelugunews

Published

on

హామీల అమలులో కాంగ్రెసు విఫలం

తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఒక్కో మహిళకు 60 వేల బాకి పడ్డ సిఎం రేవంత్

మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి

జనం వెలుగు ఆర్మూర్:- గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ప్రజల కి చ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించాడు. బోధన్ పట్టణంలో సోమవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించాడు. బోధన్ అభివృద్ధి కోసం మాజి ఎంఎల్ఏ షకీల్ హయాంలో మంజూరైన పనులను కాంగ్రెసు ప్రభుత్వం పూర్తిగా నిలిపి వేసి ప్రజలను శిక్షిస్తొందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బోధన్ అభివృద్ధి కోసం కేసిఆర్ సహకారం తో 100 కోట్లు మంజూరు చేయించగా అందులో నుండి 60 కోట్ల రూపాయల పనులు పూర్తి అయ్యాయని ఆయన తెలిపాడు. గత రెండేళ్ళు గా బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి, కాంగ్రెసు ప్రభుత్వం మిగిలిన 40 కోట్ల రూపాయల విలువైన పనులను చేయకుండా అడ్డుకుందని ఆయన విమర్శించాడు. సివిల్ సప్లైస్, లిక్కర్, బొగ్గు కుంభకోణాలలో వాటాల కోసం మంత్రులు, సిఎం కొట్లాడుతున్నారని గత రెండేళ్ళుగా కాంగ్రెసు ప్రభుత్వంలో పని చేసే నాయకులు కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆంధ్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో నడిచే రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ లేదని ఆయన దుయ్యబట్టాడు. బోధన్ మున్సిపా లిటీలో టిక్కెట్టు ఎవరికి ఇచ్చిన అందరు కలిసి కట్టుగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరాడు. ఈ సమావేశంలో మాజి ఎంఎల్ఏలు షకీల్, గణేష్ గుప్తా, మాజి ఎంఎల్సి విజి గౌడు,జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి,గిర్దావర్ గంగారెడ్డి,మాజి జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading