Connect with us

మెదక్

మీకోసం కార్యక్రమానికి  తరలివచ్చిన ప్రజలు

INTHIYAZ MIRZA

Published

on

మీకోసం కార్యక్రమానికి  తరలివచ్చిన ప్రజలు

సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే

ఇంకొన్ని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

ప్రజా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన మెదక్ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి

జనం వెలుగు, మెదక్:- ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం ప్రతినెల 2,16 తేదీల్లో మెదక్ ఎమ్మెల్యే అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన లభించింది. మెదక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకు తమ  సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, భూముల కు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. పార్ట్ బిలో  ఉన్న భూ సమస్యలను కలెక్టర్  దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే  అన్నారు.మెదక్ పట్టణంలో కొంతమంది  తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన వాళ్లందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పింఛన్,డబల్ బెడ్ రూమ్, భూమి సర్వేల సమస్యలపై ఎమ్మెల్యే  అందుబాటులో లేని అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలను వివరించి పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా వికలాంగులు ట్రై సైకిల్ బ్యాటరీ వెహికల్ కావాలని ఎమ్మెల్యే కి వినతులు సమర్పించారు, అర్హులైన వాళ్ళందరికీ ట్రై సైకిల్లు బ్యాటరీ వెహికల్ లు మంజూరు చేయాలని డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ ని ఆదేశించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మెదక్

చిలిపిచేడ్‌ MPDOగా బానోత్‌ ప్రవీణ్‌ బాధ్యతల స్వీకరణ

janamvelugunews

Published

on

చిలిపిచేడ్‌ MPDOగా బానోత్‌ ప్రవీణ్‌ బాధ్యతల స్వీకరణ

జనం వెలుగు చిలిపిచేడ్‌: చిలిపిచేడ్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా (MPDO) బానోత్‌ ప్రవీణ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు MPDOగా విధులు నిర్వహించిన ప్రశాంత్‌ స్థానంలో ప్రవీణ్‌ బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతల బదిలీ అనంతరం మాజీ MPDO ప్రశాంత్‌ కొల్చారం మండల పంచాయతీ అధికారిగా (MPO) నియమితులయ్యారు. అనంతరం కొల్చారం మండల పంచాయతీ కార్యాలయంలో MPOగా బాధ్యతలు స్వీకరించారు.

చిలిపిచేడ్‌ మండలానికి నూతన MPDOగా బాధ్యతలు చేపట్టిన బానోత్‌ ప్రవీణ్‌కు మండల పరిషత్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Continue Reading

మెదక్

చిట్కుల్‌లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం

janamvelugunews

Published

on

చిట్కుల్‌లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి చిట్కుల్ గ్రామంలోని వినాయక మండపాలకు ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సుమారు 8 వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులకు మొత్తం రూ.80 వేల విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా తారా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామ ఉప సర్పంచ్ ఎండీ అఖిల్, మాజీ సర్పంచ్ భూమయ్య, ముక్క అశోక్, బాగయ్య, ప్రవీణ్, కొమురయ్యతో పాటు పలువురు యువకులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Continue Reading

మెదక్

చిట్కుల్‌లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం

janamvelugunews

Published

on

చిట్కుల్‌లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం

ప్రతి గురువారం సంత నిర్వహణ.. తక్కువ ధరలకు నాణ్యమైన మేకలు, గొర్రెలు

జనంవెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో గురువారం మేకలు, గొర్రెల సంతను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో ప్రతి గురువారం మేకలు, గొర్రెలను విక్రయించుకునేలా సంతను ఏర్పాటు చేసినట్లు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు.

ఈ సంత ద్వారా చిట్కుల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు తమ పశువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే కొనుగోలుదారులకు నాణ్యమైన మేకలు, గొర్రెలు అందుబాటు ధరల్లో లభించేలా మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రతి గురువారం సంత నిర్వహణతో గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులకు మంచి మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading