మెదక్
కేంద్రం మీద నిరసన ఎట్లుందో చూడండి


కేంద్రం మీద నిరసన ఎట్లుందో చూడండి
జనం వెలుగు, మెదక్:- దేశంలో ఉన్న సంస్థలన్నిటినీ అమ్ముతు, ప్రైవేటీకరణ చేస్తు పోతే చివరికి దేశానికి మిగిలేది ఏముంటుంది. ని పతనానికి నాంది అని ప్రధాని మోదిపై మెదక్ బారాస జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచినందుకు నిరసనగా మెదక్ జిల్లా బారాస అధ్యక్షరాలు ఎం పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెదక్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. 2014 కంటే ముందు మోదీ అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఉంటే ,మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1250 రూపాయలకు పెరిగిందన్నారు. దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాలకు ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేసే విధంగా కేంద్రం ఉండాలి కానీ ప్రజలను రెచ్చగొడుతూ మతకల్లోలను సృష్టించే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచే విధంగా గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎల్ఐసి లాంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం ద్వారా 40,000 ఉద్యోగాలు పోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగరేణి, రైల్వే, ను ఆర్టీసీని, ప్రైవేటీకరణ చేయడంలో ఆంతర్యం ఏంటో దేశ ప్రజలందరికీ అర్థమయిందన్నారు. ఆదాని, అంబానీ కావాలా వారు సంపాదించే సొమ్ములో వాటా కావాలా అని మోదీ ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల దృష్టిలో ఉంచుకొని 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2000 రూపాయల పెన్షన్ ఇస్తే దాంట్లో 1200 రూపాయలను గ్యాస్ సిలిండర్ కు పోతుందని దానివల్ల పేద ప్రజలకు ఇబ్బంది ఎదురవుతుందని దేశాన్ని సరైన పద్ధతిలో మోది పరిపాలన చేయడం లేదన్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకువెల్లిదన్నారు. మోటార్ల కాడ మీటర్లు పెట్టకపోవడం వల్ల 30 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆపిందన్నారు. 2016 రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్ ఇస్తుంటే అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 200 రూపాయలు మాత్రమేనని అది కూడా కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ 50 లక్షల మందికి ఇస్తున్నారని పేర్కొన్నారు. రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉద్దేశం కొద్దీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ఆర్ఈజీఎస్ కింద రైతులు కళ్ళలు కట్టుకుంటే 160 కోట్లు వాపస్ ఇవ్వాలని చెప్పడంలో రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుందన్నారు.కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చేపలు ఆరబెట్టుకోవడానికి కల్లాలు కట్టుకోవడనికి అవకాశం ఇచ్చారు.అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఒక్క ఒక్క రూపాయి కూడా నల్లధనం తీసుకు రాలేదని దానివల్ల ఆదాని అంబానీలకి మేలు జరిగిందన్నారు. బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇక్కడ కూడా 24 గంటల కరెంటు కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని ఉద్దేశం కొద్ది ప్రతి సంవత్సరం 900 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి రైతులకు 24 గంటలకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజ గౌడ్, హవేళిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, సంయోద్దీన్, కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ ఉమర్, మెదక్ పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మెదక్, హవేళి ఘనపూర్ మండలం వైస్ ఎంపీపీలు ఆంజనేయులు, రాధాకృష్ణ కిషన్ యాదవ్, మెదక్ ఏఎంసీ డైరెక్టర్ సాప. సాయిలు నాయకులు రాగి. అశోక్, ప్రభు రెడ్డి, మధు, సతీష్ రావు, బాలయ్య, సుదర్శన్, మోహన్, సాయిలు, గట్టెష్, వెంకటేష్, మహమ్మద్, సిద్దిరాములు సర్పంచులు రాజేందర్ రెడ్డి,చిన్న గౌడ్, యామి రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ


ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ
జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.
రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక


ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక
జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.
మెదక్
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్


అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్
జనంవెలుగు, చిలప్ చెడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.
రక్తదాత సుఖీభవ








