మెదక్
దేశానికి దశదిశ చూపిన వ్యక్తి అంబేద్కర్


జనం వెలుగు చిలిపిచేడ్: – దేశానికి ఉపయోగపడే విధంగా అందరూ శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తి అనిత సూచించారు. మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం, చండూరు గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో న్యాయమూర్తి అనిత పాల్గొన్నారు, గ్రామానికి విచ్చేసిన న్యాయమూర్తి అనితకు గ్రామస్తులు డబ్బు చప్పులతో స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి అనిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదవాలని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాలు సమానంగా చట్టాన్ని రూపొందించారని ఆమె అన్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల దేశంలో ఎక్కడైనా స్థిరపడవచ్చు అని ఆమె తెలిపారు. వేలిముద్రలు మానివేసి సంతకాలు నేర్చుకోవాలని ఆమె సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ ,ఎంపీపీ, గ్రామ సర్పంచ్ భర్త జగన్ రెడ్డి , ఉప సర్పంచ్ రాజ్ కుమార్ బీజేపీ అధ్యక్షుడు దశరథ్ , నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు భూమయ్య, సభ్యులు పాల్గొన్నారు.
మెదక్
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ


ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ
జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.
రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక


ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక
జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.
మెదక్
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్


అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్
జనంవెలుగు, చిలప్ చెడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.
రక్తదాత సుఖీభవ








