Kamareddy
స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తే సహించేది లేదు… కాసుల బాలరాజు


పోచారంను గద్దె దించడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దాం
జనంవెలుగు, బాన్సువాడ:- రానున్న ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తే పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. బుధవారం బాన్సువాడ శివారులోని పి ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో వాటి నియోజకవర్గం ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ కాంగ్రెస్ శ్రేణుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో కాసుల బాలరాజ్ మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి కాకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తాపత్రికలలో వస్తున్న కథనాల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆలోచన సలహా మేరకు పార్టీ అధిష్టానం స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తే సహించేది లేదని వారన్నారు. నియోజకవర్గంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతి అరాచకాలకు ఎదురోడ్డి పోరాడుతున్న నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి ఒకటే విషయం పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాసుల బాలరాజ్ అమ్ముడు పోయారని చెబుతున్న ఆరోపణలు రుజువు చేయాలనీ సవాల్ విసిరారు. స్పీకర్ కుమారులు ఒక కుమారుడు ఇసుక మరో కుమారుడు కంకర దోచేస్తూ కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారని, గుత్తేదారులగా అవతారమెత్తి అధికారుల ప్రోత్సాహంతో నాణ్యతలేని పనులు చేపట్టి కోట్లు దోచుకుతిన్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించమని గొప్పలు చెబుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజమైన పేదవారికి కాకుండా వారి పార్టీ కార్యకర్తలు, వారి అనుచరులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టబెట్టారని, సొంత ఇల్లు నిర్మించుకున్న వారికి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఇస్తూ జిఎస్టి పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. పని లేని వాళ్ళు ప్రజల మధ్య లేనివారు నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలపై చర్చించేందుకు అంబేద్కర్ సాక్షిగా సిద్ధమన్నారు. తాను వ్యాపారాలు చేసుకుంటూ ఇల్లు నిర్మించుకుంటే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, నాపై ఆరోపణలు చేసేవారు నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నవారైతే నిరూపించాలని ఆయన సవాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కొరకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను చేసుకుంటూ అధికార పార్టీ నాయకులు చేస్తున్న అవినీతిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే గ్రామాలలో కుల సంఘాలతో వారి అనుచరాలతో బలవంతంగా తీర్మానాలు చేస్తూ కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఏది ఏమైనా పార్టీ అధిష్టానం స్థానికులకు టికెట్ కేటాయిస్తే అందరం కలిసి సమిష్టిగా ఉండి పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ వెంకటరామిరెడ్డి, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాలేక్, బ్లాక్ ఏ బ్లాక్ బీ అధ్యక్షులు అసద్ బిన్ మోసిన్ చంద్రశేఖర్, బాన్సువాడ, రుద్రూర్, చందుర్, వర్ని, పోతంగల్, బిర్కుర్, కోటగిరి, మొస్రా, చందూర్, మండలాల అధ్యక్షులు మంత్రి గణేష్, పుప్పాల శంకర్, లక్ష్మణ్, పోతురజ్ శ్రీనివాస్, షాహిద్, అరుణ్, సురేష్ బాబా, బోయిని శంకర్ పట్టణ అధ్యక్షులు మసాని శేఖర్ రెడ్డి అదికార ప్రతినిధీ గుడాల నగేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Education
విద్యా హక్కు చట్టం అమలు చేయాలని కలెక్టర్కు వినతి


విద్యా హక్కు చట్టం అమలు చేయాలని కలెక్టర్కు వినతి
జనంవెలుగు, కామారెడ్డి:- విద్యా హక్కు చట్టం (RTE) సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలని కోరుతూ, పౌర హక్కుల కోసం పనిచేస్తున్న జాతీయ స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR) రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాల ప్రస్థానం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం రోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి (DEO)లకు CCR ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. 2025–26 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 12(1)(C) నిబంధనను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీసీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంచికట్ల అనిల్ కుమార్ సూచనలతో మిషన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అశోక్ కాకర్ల నేతృత్వంలో జిల్లా ప్రతినిధులు జోనల్ కార్యదర్శి కరీముద్దీన్, జిల్లా కార్యదర్శి బూర్ల శ్రవణ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి. భాస్కర్, మీర్జాపురం రామకృష్ణ, ఎస్.కే. సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Kamareddy
గ్రామపంచాయతీ అవకతవకలపై కలెక్టర్కు సీసీఆర్ నివేదిక సమర్పణ


గ్రామపంచాయతీ అవకతవకలపై సీసీఆర్ నివేదిక కలెక్టర్కు సమర్పణ
జనంవెలుగు, కామారెడ్డి:- కామారెడ్డి జిల్లా నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) సంస్థను సంప్రదించారు. ఈ విషయంపై సీసీఆర్ సభ్యులు రికార్డు వెరిఫికేషన్ నిర్వహించి, అనేక లోటుపాట్లను గుర్తించారు. గ్రామపంచాయతీలో ఉండాల్సిన రిజిస్టర్లలో సగానికి పైగా రిజిస్టర్లు లేని విషయాన్ని పంచాయతీ సెక్రటరీ రాతపూర్వకంగా తెలిపారు. లభించిన రిజిస్టర్లలో అనేక తప్పులు కూడా గుర్తించబడ్డాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గత 10 సంవత్సరాల రికార్డులను పరిశీలించాలని కోరినప్పటికీ, కేవలం 3-4 సంవత్సరాల రికార్డులు మాత్రమే లభించాయి. వాటిలో కూడా నిర్వహణ సరిగా లేకపోవడం గమనార్హం. ఈ వివరాలను ఆధారంగా తీసుకుని సీసీఆర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఒక ఫైనల్ రిపోర్టును రూపొందించి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ డిపిఓలకు అందజేసింది. సీసీఆర్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వేల దరఖాస్తులు, రికార్డుల తనిఖీలు చేశామని, ఎవరైనా అవకతవకలను గమనించినపుడు తమ సంస్థను సంప్రదించాలని, సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందజేయబడతాయని తెలిపారు. అదనంగా, ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించడానికి సీసీఆర్ సంస్థ పాఠశాలలు, కళాశాలలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో నేవూరి రత్నాకర్, చరణ్ కాంత్, గుండ్ల శివచంద్రం, కరీముద్దీన్, ఉత్తర తెలంగాణ జోన్-1 ప్రతినిధి బి. శ్రావణ్ కుమార్, జిల్లా ఇన్చార్జ్ వసంత్ జాదవ్, కేతి మల్లికార్జున్, షేక్ ముజీబ్, నయీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Crime
స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ


స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ
భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
జనంవెలుగు, కామారెడ్డి, సెప్టెంబర్18:- కామారెడ్డి పట్టణంలో బుధవారం ఉదయం ఓ స్కూల్ బస్సులో పెను ప్రమాదం సంభవించింది. బస్సులో బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను కిందకు దింపేశారు. ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కామారెడ్డిలోని బ్రిల్లియంట్ గ్లామర్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్ప టికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.








