Connect with us

Birthday

జనం కోసం జీవిస్తే జన్మలో నిలిచిపోతావు

janamvelugunews

Published

on

జనం కోసం జీవిస్తే జన్మలో నిలిచిపోతావు

బోథ్ ఎంపీడీవో రమేష్

జనంవెలుగు, ఆదిలాబాద్ బ్యూరో:- భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆలు పెరగని కృషిచేసిన గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని బోత్ ఎంపీడీవో రమేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యలయంలో ఆదివారం అంబేద్కర్ 133 జయంతిని పురస్కరించుకొని బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా భారత దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఉన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జన్మలో నిలిచిపోతావు అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చాటి చెప్పారని గుర్తు చేశారు. ఆత్మగౌరవంతో బతకాలని అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని నేర్ప నేర్పాడు అని జ్ఞానాన్ని బోధించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఆర్థికవేత్త కోవిదుడు రాజనీతి జ్ఞానుడు అంటరానితనం ఆలు పెరగని పోరాటం చేసిన గొప్ప మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు భారత రాజ్యాంగ రచయితగా అనగారిన వర్గాలలో రాజకీయ నిత్య. సాంఘిక సమర షీలా బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. భారత రాజ్యాంగ శిల్పి విద్యావేత్త మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన మహానేత బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల న్యాయం అందించడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని ఈరోజు బడుగు బలహీన వర్గాలు వారు ఒక మంచి స్థాయిలో ఉద్యోగాలలో ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన బిక్షా అని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ లేకుంటే బడుగు బలహీన వర్గాల పరిస్థితి చాలా దుర్లభంగా ఉండేదని అన్నారు. రాజ్యాంగం రచనలు బిఆర్ అంబేద్కర్ పాత్ర చాలా కీలకమైందని 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు ఏకధాటిగా భారత రాజ్యాంగం రచన కోసం నిర్విరామంగా కృషిచేసి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తన ఆరోగ్యం క్షమించిన లెక్కచేయకుండా ఏకధాటిగా రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశంలో జన్మించడం ఇది బడుగు బలహీన వర్గాలు చేస్తున్న గొప్ప పుణ్యమని ఆయన అన్నారు. చదువుకునే ఒక ఆయుధంగా మలుచుకొని చదువుతూనే అన్ని సాధ్యమవుతుందని నిరూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రతి బడుగు బలహీన వర్గాల అనుగారిన వర్గాల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరి అంబెడ్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్యక్రమంలో కార్యాలయం సుబ్బారెడ్డి దుర్గం రాజేశ్వర్ టైపిస్ట్ సంతోష్ రెడ్డి కార్యాలయ సిబ్బంది సందీప్ రెడ్డి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Birthday

|Nandipet నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….

janamvelugunews

Published

on

నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….

పల్లె పల్లె నా పండగలా 135 వ అంబేద్కర్ జయంతి…

నందిపేట్ ఏప్రిల్ 14 (జనం, వెలుగు): నందిపేట డొంకేశ్వర్ మండలాలలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఆయన ప్రతిమల వద్ద పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

ముందుగా మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో మండల కేంద్రం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చౌరస్తా మొత్తం నీలిరంగుల జెండాలతో నింపేసి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.

అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా మహన్నదనా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వివిధ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, బహుజన పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు జోహార్లు అర్పించారు. మండల ట్రస్మా, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న మాట్లాడుతూ….. భీమ్రావు రాంజీ అంబేద్కర్ అనే పేరు, ఆయన ప్రతిమ లేని ప్రదేశం ఈ భారత దేశంలో ఎక్కడ లేదని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన యుగ పురుషుడని కొనియాడారు.

సమానత్వం కొరకు అంటరాని తనం అనే విష సంస్కృతిని రూపుమాపేందుకు ఎంతో దూరదృష్టిగా రాజ్యాంగ చట్టం కల్పించి అట్టడుగు వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడు అన్నారు. మండల కేంద్రం అంబేద్కర్ సంఘం సభ్యులు మాట్లాడుతూ…. అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో బహుజనులకు రక్షణ కరువయ్యేదని ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా సమాన హక్కులు ఉండేవి కావని, ఉక్కుపాదంతో అణిచివేసేవారని, ఈరోజు అనగారిన వర్గాల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే ఆ బిక్ష అంబేద్కర్ పెట్టిన భిక్షేనని అన్నారు.

Continue Reading

Birthday

బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక

జనం వెలుగు – చౌటకూర్:- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరఫ్‌పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో మోహన్, విలేజ్ ప్రెసిడెంట్ గోవర్ధన్, మాజీ సర్పంచ్ హనుమంతరావు, పర్మేశ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, వార్డ్ మెంబర్ వెంకటేశం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న నాయకులు సురేష్ సేవలను ప్రశంసించారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఉత్సాహంగా జరుపుకున్నారు.

Continue Reading

Birthday

PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి

janamvelugunews

Published

on

PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి

జనంవెలుగు, నిజామాబాద్:- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని PRTU తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక పులాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్ మాట్లాడుతూ, అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి సమానత్వాన్ని, స్వేచ్ఛను ప్రసాదించారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగేశ్వరరావు, గంగాధర్, బుచ్చన్న, జావీద్, శ్రీకాంత్, వినోద్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతిజ్ఞ చేశారు.

Continue Reading